పెండింగ్ లో110 ఎమ్మెస్వో లైసెన్సు దరఖాస్తులు

0
637

సమాచార ప్రసార మంత్రిత్వశాఖ దగ్గర 110 ఎమ్మెస్వో లైసెన్సు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. 2020 జులై ఆఖరు వరకు దరఖాస్తుల పరిస్థితి మీద మంత్రిత్వశాఖ వెలువరించిన జాబితా ప్రకారం ఈ వివరాలున్నాయి. జూన్ లో 8, జులై లో 9 కొత్త దరఖాస్తులు రాగా జూన్ లో ఆమోదించిన దరఖాస్తులు 4, జులై 15 ఉన్నాయని కూడా ఆ జాబితా పేర్కొంది.

కొత్తవి చేరుతూ, పాతవాటిలో కొన్ని క్లియర్ అవుతూ ఉండగా జులై ఆఖరుకల్లా ఇంకా 110 పెండింగ్ లో ఉన్నాయి. అయితే, జూన్ ఆఖరునాటికి పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల సంఖ్య 116  ఉండేది. 2019 నవంబర్ లో అతి తక్కువగా 101 ఎమ్మ్స్వో లైసెన్స్ దరఖాస్తులు మాత్రమే పెండింగ్ లో ఉండేవి.

ఏప్రిల్ 2019 నుంచి జులై 2020 వరకు దాఖలైన మొత్తం కొత్త దరఖాస్తులు 224 కాగా వాటిలో ఆమోదం పొందినవాటు సంఖ్య 114. అందువలన మిగిలిన 110 పెండింగ్ లో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here