కేబుల్ టీవీ ఆపరేటర్లకు అండగా ఉంటాం ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్

0
1290

హైదరాబాద్, ఆగస్టు 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)కేబుల్ టీవీ ఆపరేటర్లకు అండగా ఉంటాం అని ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని హైటెక్స్ లోని హాల్ నంబర్ 2లో 3రోజులపాటు జరగనున్న సి ఎం సి గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10వ కేబుల్ నెట్ ఎక్స్పో ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎక్స్పో ను ఏర్పాటుచేసిన నిర్వాహకులను మంత్రి అభినందించారు. పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించుకొంటు, కేబుల్ టీవీ, ఇంటర్ నెట్ రంగంలో ఇలాంటి కార్యక్రమాలు ఆపరేటర్ ల కొరకు ఏర్పాటు చేయడం చాలా బాగుందన్నారు. రాష్ట్ర కేబుల్ ఆపరేటర్లు పోల్ టాక్స్ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యని వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా అని , కేబుల్ టీవీ పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి టెక్నీషియన్స్ కు లేబర్ డిపార్ట్మెంట్ చే ఒక గుర్తింపు కార్డును ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని అన్నారు. అనంతరము వివిధ స్టాల్స్ ని మంత్రి సందర్శించడం జరిగింది.
ఈ సందర్బంగా కేబుల్ టీవీ సంఘం తరపున మంత్రిని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెస్ ఓ గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డిని ప్రత్యేకంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సిఎంసి గ్రూప్ చైర్మన్ రాము తెలంగాణ రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల నాయకులు జితేందర్, పమ్మి సురేష్, హరి గౌడ్, భాస్కర్, శ్రీనివాస్ రెడ్డి, ఉపేందర్, సంపత్, జి టి పి ఎల్ నుండి మనోజ్ దుబే,
బ్రైట్ వే కేబుల్ నెట్ వర్క్ అధినేత సుభాష్ రెడ్డి, ఎస్ ఎస్ ఎల్ సి స్మార్ట్ వే అధినేత కొల కిషోర్ తో పాటు కేబుల్ నెట్ వర్క్ ఎమ్ ఎస్ ఓ లు, ఆపరేటర్లు, హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here