108 ఎమ్మెస్వో దరఖాస్తులు పెండింగ్

0
472

డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న 108 మంది ప్రస్తుతం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ స్వయంగా ఈ సమాచారాన్ని వెల్లడించింది. లైసెన్స్ పొందిన ఏదాదిలోగా డిజిటల్ హెడ్ ఎండ్ ప్రారంభించకపోతే లైస్నెస్ రద్దవుతుంది. అదే సమయంలో దేశంలో ఎక్కడ లైసెన్స్ తీసుకున్నా, దేశమంతా కేబుల్ వ్యాపారం చెసుకునే అవకాశం కూడా ఉంది.

సమాచార, ప్రసారమంత్రిత్వశాఖ ప్రతి నెలా ప్రచురించే సమాచారం ప్రకారం ఎమ్మెస్వో లైసెన్స్ కోసం జులై లో 9 దరఖాస్తులు రాగా, ఆగస్టులో 7 కొత్త దరఖాస్తులు వచ్చాయి. జులై లో 15 లైసెన్సులు మంజూరు కాగా ఆగస్టులో ఆ సంఖ్య 9కి తగ్గింది. మొత్తానికి ఆగస్టు చివరినాటికి పెండింగ్ దరఖాస్తులు 108 ఉన్నాయి. జులై ఆఖరుకు పెండింగ్ లో ఉన్న 101 తో పోల్చినప్పుడు కాస్త పెరిగినట్టే లెక్క.

నిరుడు ఏప్రిల్ నుంచి మంత్రిత్వశాఖకు అందిన మొత్తం దరఖాస్తులు 231 కాగా ఇప్పటివరకు వాటిలో 123 దరఖాస్తులకు ఆమోదముద్ర పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here